KNRUHS: యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: యూజీ ఆయుష్ వైద్య కోర్సులో ప్రవేశాలకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం సెప్టెంబర్ 25న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆయుష్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రకటన జారీ చేసింది. నీట్–2023 అర్హత సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 26 నుంచి వచ్చే నెల 2 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది.
అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్ చేయాలని సూచించింది. మరింత సమాచారం కోసం వర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.inను సందర్శించాలని పేర్కొంది.
చదవండి: Navodaya Admission: నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Published date : 26 Sep 2023 12:02PM