TSRTC: హాకీంపేటలో టీఎస్ఆర్టీసీ ఐటీఐ కొత్త కళాశాల
10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల విద్యార్థులు అక్టోబర్ 8వ తేదీలోగా iti.telangana.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు అక్టోబర్ 9వ తేదీన వాక్ ఇన్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతోంది.
చదవండి: Telangana Government Employees : ఇకపై ఈ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులే..
“తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్, హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసింది. గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని సంస్థ ప్రారంభించింది. తాజాగా హాకీంపేట ఐటీఐ కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్(డీజీటీ) అనుమతి ఇచ్చింది. ఆ కళాశాలలో ఈ ఏడాది నుంచి మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఈ కొత్త కళాశాలలో నిపుణులైన అధ్యాపకులతో పాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారులచే సంస్థ తరగతులను నిర్వహిస్తుంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిఫ్ సౌకర్యాన్ని కల్పిస్తాం. నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్ ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం కోసం 9100664452 ఫోన్ నంబర్ ని సంప్రదించాలి.” అని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు సూచించారు.