RGUKT: ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఇవే..
Sakshi Education
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 2023 విద్యాసంవత్సరంలో నిర్వహిస్తున్న ప్రవేశాల్లో భాగంగా జూలై 5 నుంచి తొమ్మిదో తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు జూలై 4న తెలిపారు.
నాలుగు ట్రిపుల్ ఐటీలకు దరఖాస్తు చేసిన ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. జూలై 5, 6న మాజీ సైనికోద్యోగుల పిల్లల కేటగిరీ అభ్యర్థులకు, జూలై 5 నుంచి తొమ్మిదో తేదీ వరకు క్రీడా కోటా అభ్యర్థులకు, జూలై 6వ తేదీన దివ్యాంగ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అభ్యర్థులకు, జూలై నుంచి 7వ తేదీ వరకు ఎన్‌సీసీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్టు తెలిపారు. జూలె 13న ట్రిపుల్ ఐటీ సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించారు.
చదవండి:
RGUKT: ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇలా.. కౌన్సెలింగ్‌కు ఇవి తప్పనిసరి..
Published date : 05 Jul 2023 05:55PM