10, 12 ఆఫ్ లైన్ పరీక్షల రద్దుకు నిరాకరణ
ఈ తరహా పిటిషన్లతో విద్యార్థుల్లో తప్పుడు ఆశలు కల్పించవద్దని, గందరగోళం సృష్టించొద్దని వ్యాఖ్యానించింది. కరోనా నేపథ్యంలో ఆఫ్‌లైన్ పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థుల తరఫున దాఖలైన పిటిషన్ ను జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘‘పరీక్షల రద్దు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయడం ఓ సంప్రదాయంగా మారకూడదు. ఇలాంటి పిటిషన్లు ఎలా దాఖలు చేస్తారు ? వీటి వల్ల పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులకు తప్పుడు ఆశలు కల్పించినట్టు, తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. ప్రభుత్వ నిర్ణయాలు చెప్పడానికి మీరెవరు? మేమెవరు?. అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం సరిగ్గా లేకుంటే సవాల్ చేసుకోవచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది. ఇలాంటి పిటిషన్లతో మరోసారి వస్తే జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ పిటిషన్ కొట్టివేస్తున్నట్టుగా తెలిపింది.
చదవండి:
Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలలో సీబీఎస్‌ఈ సిలబస్..ప్రయోజనాలు ఇవే..
Good News : 'సీబీఎస్‌ఈ' స్కూల్ అడ్మిషన్లపై కీలక ప్రకటన
Practicals : ఇంటి నుంచే ‘ప్రాక్టికల్స్’..వీళ్లకు మాత్రమే..