Technical Certificate Course: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ పరీక్షలు తేదీలు ఇవే..
టైలరింగ్, యంబ్రాయిడరింగ్ లోయర్ పరీక్ష ఫిబ్రవరి 25న, టైలరింగ్, యంబ్రాయిడరింగ్ హైయర్ పరీక్ష 26 నుంచి 27వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారని చెప్పారు.
చదవండి: Tailoring Courses: టైలరింగ్, ఎంబ్రాయిడరీ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు
డ్రాయింగ్ లోయర్, హైయర్ పరీక్షలు ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహిస్తారని వివరించారు. టెక్నికల్ కోర్స్ పరీక్షలు రాసే అభ్యర్థులు హాల్ టికెట్ కోసం www. bse.telangana.gov.in అను వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని, టైలరింగ్ ఎంబ్రాయిడరీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా టైలరింగ్ మిషన్లను తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు.