UGC: మాతృభాషలోనే ‘ఉన్నత విద్య’ బోధన
ఈ మేరకు ఆయన ఏప్రిల్ 19న ఓ లేఖ రాశారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా స్థానిక భాషల్లో బోధన, పరీక్షల విధానం అత్యంత కీలకమైందిగా పేర్కొన్నారు. దీనివల్ల ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఉన్నత విద్యలో మరింత రాణిస్తారని అభిప్రాయపడ్డారు. ఉన్నత విద్యలో ఇప్పుడున్న 27 శాతం ప్రవేశాల నిష్పత్తిని 2035 నాటికి 50 శాతానికి తీసుకెళ్ళడం లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఉన్నత విద్య సంస్థలు కీలకమైన పాత్ర పోషించాలని సూచించారు. మాతృభాషలో పుస్తకాల తయారీ, బోధనకు అవసరమైన ఫ్యాకల్టీ సమకూర్చుకోవాల్సిన పరిస్థితిని గుర్తు చేశారు. అన్ని యూనివర్సిటీలు పరీక్షల్లో విద్యార్థులు తెలుగులో రాసేందుకు అనుమతించాలని యూజీసీ చైర్మన్ కోరారు. ఈ నేపథ్యంలో మాతృభాషలో బోధనకు గల అవకాశాలపై సమగ్ర వివరాలను ఆన్‌లైన్ ద్వారా పంపాలని వర్సిటీలను, ఉన్నత విద్యా మండళ్ళను కోరారు.
చదవండి: UGC: ఆ కోర్సులకు అనుమతి ఉండాల్సిందే
ఈ వివరాలు పంపండి...
ఉన్నత విద్యలో విభాగాల వారీగా పుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్, స్టడీ మెటీరియల్ స్థానిక భాషలో ఏమేర అందుబాటులో ఉన్నాయో తెలపాలి. ఇతర భాషల్లో ఉన్న పుస్తకాల తర్జుమాకు గల అవకాశాలను వివరించాలి. స్థానిక భాషలో బోధించేందుకు బోధకులు ఏమేర అందుబాటులో ఉన్నారు. సబ్జెక్ట్ నిపుణులు, స్కాలర్స్ స్థానిక భాషల్లో తర్జుమా చేసేవాళ్ళు ఏమేర ఉన్నారు. స్థానిక భాషల్లో పుస్తకాల ముద్రణకు గల అవకాశాలు, ప్రింటింగ్, పబ్లిషర్ల వివరాలు తెలపాలి. స్థానిక భాషల్లో విద్యార్థులు ఏమేర పరీక్షలు రాయగలరో వివరించాలి’’అని కోరారు.