Skip to main content

రాష్ట్రస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ

ఆదిలాబాద్‌ టౌన్‌: రాష్ట్రస్థాయి జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. డిసెంబ‌ర్ 5న‌ హైదరాబాద్‌ బేగంపేటలోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌లో నిర్వహించిన సైన్స్‌ కాంగ్రెస్‌లో ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు.
Talent of District Students in State Level Science Congress   Adilabad Town students shine at State Science Congress

ఆరోగ్యం, సంక్షేమం కోసం పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం అనే అంశంలో రాష్ట్రస్థాయి ప్రదర్శన నిర్వహించారు. ఇందులో జోసెఫ్‌ కాన్వెంట్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధి దర్శన్‌ కుమార్‌, మహాత్మా జ్యోతి బాపూలే ఈదుల్లా సావర్‌గాంవ్‌ విద్యార్థి ఎల్‌.శ్రావణీ, లిటిల్‌ ప్లవర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థి ఏ.సాయి తేజస్వీని ప్రదర్శనిచ్చారు.

చదవండి: Commissioner of School Education: విజ్ఞానశాస్త్ర ప్రదర్శన(సైన్స్ ఫేర్‌) రాష్ట్రస్థాయి

పర్యావరణ హితం కోసం వ్యర్థ పదా ర్థాల వినియోగం, సామాజిక స్థితిగతుల మార్పు, నిర్వహణ అనే అంశాలపై విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విశ్లేషణ అందించారు. రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ప్రతిభ చాటిన సదరు విద్యార్థులను డీఈఓ ప్రణీత అభినందించారు. వారి వెంట జిల్లా సైన్స్‌ అధికారి కె.రఘు రమణ, ఎన్‌సీఎస్‌సీ జిల్లా అకాడమిక్‌ కో ఆర్డినేటర్‌ ఆరె భాస్కర్‌ , గైడ్‌ టీచర్స్‌ వినోద్‌, సుశాంత్‌రెడ్డి, రత్నబాయి పాల్గొన్నారు.

Published date : 07 Dec 2023 10:43AM

Photo Stories