obert Hale: విద్యార్థులకు రూ. 20కోట్లు నగదు బహుమతి.. వైరల్ అవుతున్న వీడియో
'రాబర్ట్ హేల్స్' అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, గ్రానైట్ టెలీకమ్యూనికేషన్స్ కో-ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఐదు బిలియన్ డాలర్స్ సంపద కలిగి ఉన్న ఈయన రూ. 20 కోట్లు ఇవ్వడం పెద్ద గొప్ప కాకపోవచ్చు, కానీ 2500 మంది విద్యార్థులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
చదవండి: 5,000 మందికి రిలయన్స్ చేయూత.. ఒక్కొక్కరికీ రూ.2 లక్షల వరకు..
రాబర్ట్ హేల్స్ యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌లో విద్యార్థులకు ఈ నగదు బహుమతి అందించారు. 2023 యూమాస్ బోస్టన్ అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్ విద్యార్థులు ఆయన పంపిణీ చేసిన గిఫ్ట్స్ క్యూలైన్లో నిలబడి తీసుకున్నారు. అయితే వారికి రెండు ఎన్వలప్ కవర్లను అందించారు. ఒక కవర్ మీద గిఫ్ట్ అని 500 డాలర్స్ ఉన్నాయి. మరో కవర్ మీద గివ్ అని 500 డాలర్స్ ఉంచారు. అంటే తీసుకోవడంలో కంటే ఇవ్వడంలో ఎక్కువ ఆనందం పొందండని తెలిపారు. ఈ కార్యక్రమం షేరింగ్, కేరింగ్, గివింగ్ ప్రాముఖ్యతలను గురించి తెలియజేస్తుంది.
చదవండి: Education: ఆస్ట్రేలియాలో చదువుకుంటే నాలుగేళ్లపాటు స్కాలర్‌షిప్స్... ఇంకా ఏమేం ఉపయోగాలంటే...