నాణ్యమైన ఉన్నత విద్యతోనే విద్యార్థుల ప్రగతి
రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో నవంబర్ 24న ఆమె రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. ప్రతి విద్యారి్థలోని సామర్థ్యాన్ని గుర్తించాలని, విద్యారి్థనులు పరిశోధనలను కొనసాగించడానికి మెరుగైన సౌకర్యాలను కలి్పంచాలని ఆమె కోరారు. ప్రతి విద్యార్థి సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్‌ను రూపొందించాలని కోరారు.
చదవండి: పాత ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు విరాళంగా ఇవ్వండి
ఉన్నత విద్యా సంస్థల్లో బాలికల నమోదు అనూహ్యంగా పెరుగుతోందని, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వారి కోసం మరిన్ని సంఖ్యలో హాస్టళ్లు అవసరమని ఆమె స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఉపాధ్యాయినులు, విద్యారి్థనులకు మెరుగైన సౌకర్యాలు కలి్పంచడం చాలా అవసరమన్నారు. సాఫ్ట్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరచాలని సూచించారు. సమావేశంలో ఉస్మానియా, కాకతీయ వర్సిటీల సీనియర్ విద్యావేత్తలు పాల్గొన్నారు.
చదవండి: Tamilisai Soundararajan: విద్యార్థులను నిరంతరం గమనించాలి: గవర్నర్