విద్యార్థులు 2 నెలల పాటు సామాజిక సేవ చేయాల్సిందే..
రెండు రోజులుగా గుంటూరు శివారు లాం ఫాం వ్యవసాయ పరిశోధన స్థానం, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న బోర్డు నాలుగో సమావేశం డిసెంబర్ 30తో ముగిసింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన ఉప కులపతులు సమావేశంలో పాల్గొని, ఉన్నత విద్యాభివృద్ధికి, సమాజాభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ తదితర విషయాలపై చర్చించినట్లు వివరించారు.
చదవండి: Hemachandra Reddy: ‘పిల్లలు అద్భుతంగా ఎదిగే అవకాశం కల్పించాలి’
ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు రెండు నెలల పాటు సమాజ సేవ తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎంతో ప్రగతి సాధించామని, ఆహార ధాన్యాల ఉత్పత్తి, పెరుగుదల మిగిలిన రాష్ట్రాల కంటే అధికంగా ఉందన్నారు.