PJTSAU: క్షేత్రస్థాయి సందర్శనలో విద్యార్థులు
Sakshi Education
దమ్మపేట: అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు అక్టోబర్ 13న వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు.
దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు అంకత మహేశ్వరరావు ఆయిల్‌పామ్ పామాయిల్ క్షేత్రానికి వచ్చిన వారు ఆయిల్‌పామ్‌తో పాటు అంతర్ పంటగా సాగు చేస్తున్న కోకో సాగు విధానాలను తెలుసుకున్నారు. అలాగే, వర్మీ కంపోస్ట్ తయారీ, కోళ్ల పెంపకంపై రైతు వివరించారు. కార్యక్రమంలో పావని, నీలిమ, రమేశ్, కృష్ణతేజ, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
Investments in agri tech startups: అగ్రి టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
Agricultural Scientist: స్వామినాథన్.. ఓ వ్యవసాయ శాస్త్రవేత్త
Published date : 14 Oct 2023 03:33PM