కాగజ్‌నగర్‌టౌన్: పీజీ ప్రవేశపరీక్షలో కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మినరసింహం తెలిపారు.
పీజీ ప్రవేశపరీక్షలో విద్యార్థుల ప్రతిభ
పీజీ ఎంట్రెన్స్‌లలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించి ఆయా విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో సీట్లు సాధించినట్లు పేర్కొన్నారు. కళాశాలకు చెందిన కొస్నం శ్రావణి వృక్ష శాస్త్ర విభాగంలో 242వ ర్యాంక్ సాధించగా, తాటి శ్రీకాంత్ కామర్స్ విభాగంలో 343వ ర్యాంక్, కొరేత మౌనిక వృక్ష శాస్త్ర విభాగంలో 797వ ర్యాంక్, చాప్లే బికారు రసాయన శాస్త్రంలో 1373వ ర్యాంక్‌లు సాధించారు.