Sambhavi: బేటీ బచావో, బేటీ పడావోపై విద్యార్థిని జాగృతి
హుబ్లీకి చెందిన శాంభవి మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. ఆడ పిల్లల కోసం కేంద్రం చేపట్టిన ఈ పథకం ప్రచారానికి శాంభవి నడుంబిగించింది. గతనెల 25న కేఎల్ ఈ కళాశాల నుంచి కారులో జాగృతి యాత్రను ఆమె ప్రారంభించారు. హుబ్లీ ఉత్తర రోటరీ క్లబ్ సహకారం అందించింది.
చదవండి: KMS Khalsa: జగనన్న గోరు ముద్ద భేష్!
16 రోజుల పాటు జాగృతి అభియాన్ నిర్వహించిన శాంభవి ఆరు రాష్ట్రాలలో పర్యటించి అక్టోబర్ 3న పంజాబ్‌లోని లూథియానాకు చేరుకుని యాత్రకు ముగింపు పలికారు. హుబ్లీ నుంచి పంజాబ్ 5 వేల కిలో మీటర్ల దూరాన్ని ఒక్కరే కారులో బేటీ బచావో, బేటీ పడావోపై ప్రచారం చేశారు. దారి పొడవున 16కు పైగా చర్చాగోష్టులు, సమావేశాలను నిర్వహించి మహిళా సాధికారితపై మాట్లాడారు. శాంభవి కృషి స్ఫూర్తిదాయకమని రోటరీ క్లబ్ హుబ్లీ ఉత్తర శాఖ అధ్యక్షులు డాక్టర్.నాగరాజ్ శెట్టి ప్రశంసించారు. ఈ సందర్భంగా శాంభవి మాట్లాడుతూ... మహిళా సాధికారత, మహిళల ఆరోగ్యంపై జాగృతి కల్పించామన్నారు. ఈ పర్యటన తనకు ఎంతో అనుభవం కలిగించిందన్నారు. కేఎల్‌ఈ సంస్థ ఆమె కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసింది.