KMS Khalsa: జగనన్న గోరు ముద్ద భేష్!
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో–బేటీ పడావో అమలును జనవరి 24న ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రం సరఫరా చేస్తోన్న బలవర్థకమయిన బియ్యంను (ఫోర్టిఫైడ్ రైస్) విద్యార్థులు ఎటువంటి అపోహలకు పోకుండా తినాలని సూచించారు.
చదవండి: Education: ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్ రాష్ట్రంలోనూ అమలు
ఈ బియ్యం తినడం వలన ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీ–12 లభిస్తుందని, రక్తహీనత ఉండదని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ (ఎండీఎం)ను ఏపీ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. భోజనంలో నాణ్యత, మెనూ, తాగునీరు బాగున్నాయని కితాబిచ్చారు. మధ్యాహ్నం భోజన పథకం నాణ్యతగా అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు, హెచ్‌ఎం గద్దె సూర్యకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
చదవండి: ప్రభుత్వ స్కూళ్లల్లో మెరుగవుతున్న చదువులు.. తరగతుల వారీగా గ్రేడ్లు ఇలా..