New Courses Offered: సైఫాబాద్ పీజీ కాలేజీలో కొత్త కోర్సు
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పరిధిలోని సైఫాబాద్ పీజీ కాలేజీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కోర్సును ఈ విద్య సంవత్సరం నుం చి ప్రవేశ పెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుగా 40 సీట్లతో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.
‘స్టాటిస్టిక్స్’కోర్సులకు కేరాఫ్ ఐఎస్‌ఐ
1931లో ప్రొఫెసర్ పీసీ మహాలనోబిస్ ఆధ్వర్యంలో స్టాటిస్టికల్ ల్యాబొరేటరీగా ప్రారంభమైంది. అనంతరం ఈ రంగం ప్రత్యేకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌గా ప్రకటించింది. ఐఎస్‌ఐ క్యాంపస్‌ల్లో ఉన్నత ప్రమాణాలతో అందించే స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్ వంటి 15కు పైగా డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), డాక్టరేట్ కోర్సులకు ఎంతో గుర్తింపు ఉంది. ప్రస్తుత ఏడాది ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినవారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు.ఐఎస్‌ఐ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. పూర్తి వివరాలు...
అందించే కోర్సులు- అర్హతలు:
బీస్టాట్(ఆనర్స్): మూడేళ్ల ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్/10+2లోమ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు పాసైనవారు అర్హులు. ఈ కోర్సు కోల్‌కతాలోని క్యాంపస్‌లో అందిస్తున్నారు.
బీమ్యాథ్(ఆనర్స్): బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్న ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇంటర్ /10+2లో మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు పాసైనవారు అర్హులు.
ఎంస్టాట్: రెండేళ్ల ఈ కోర్సును కోల్‌కతా, ఢిల్లీ క్యాంపస్‌లలో అందిస్తున్నారు. స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసుండాలి. లేదా ఐఎస్‌ఐలో బీమ్యాథ్స్ గాని స్టాటిస్టికల్ మెథడ్‌స అండ్ అనలిస్టిక్స్‌లో పీజీ డిప్లొమా చేసి ఉండాలి. మొదటి సంవత్సరం విద్యను కోల్‌కతా, చెన్నై, ఢిల్లీలో; ద్వితీయ సంవత్సరం కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు.
ఎం మ్యాథ్: రెండేళ్ల ఈ కోర్సును ఒక ఏడాది బెంగళూరు, మరో ఏడాది కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఈసారి కోల్‌కతాలో చదవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్, ఐఎస్‌ఐలో బీ స్టాట్ డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు.
ఎంఎస్(క్వాంటిటేటివ్ ఎకనమిక్స్): రెండేళ్ల ఈ అడ్వాన్స్‌డ్ ఎకనామిక్స్ కోర్సును కోల్‌కతా, ఢిల్లీ క్యాంపస్‌లలో అందిస్తున్నారు. ఇంటర్‌లో మ్యాథ్స్‌తోపాటు ఏదైనా డిగ్రీ పాసైనవారు అర్హులు.
ఎంఎస్(క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్స్): రెండేళ్ల కాలపరిమితి గల ఈ కోర్సులో రెండు సెమిస్టర్లు బెంగళూరులోను, మూడో సెమిస్టర్ హైదరాబాద్‌లో అభ్యసించాల్సి ఉంటుంది. నాలుగో సెమిస్టర్ ప్రాజెక్టు వర్క్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంఎస్(లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్): ఈ కోర్సు బెంగళూరు క్యాంపస్‌లో ఉంది. ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు.
ఎంటెక్(కంప్యూటర్ సైన్స్)/ఎంటెక్(క్రిప్టోలజీ అండ్ సెక్యూరిటీ): ఈ కోర్సులు కోల్‌కతా ఐఎస్‌ఐ క్యాంపస్‌లో అందిస్తున్నారు. ఇందులో చేరేందుకు నాలుగేళ్ల డిగ్రీ (బీఈ/బీటెక్ వంటివి),ఏదైనా మాస్టర్ డిగ్రీ పూర్తి చేయాలి. ఇంటర్‌లో మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి.
ఎంటెక్(క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్‌స రీసెర్చ్): ఈ కోర్సును కూడా కోల్‌కతా క్యాంపస్‌లోనే అందిస్తున్నారు. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీతోపాటు, ఎంస్టాట్ చేసినవారు లేదా బీఈ/బీటెక్ చేసినవారు అర్హులు.
పీజీడీఎస్‌ఎంఏ: ఏడాది కాలపరిమితి గల ‘పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్‌స అండ్ అనాలసిస్’ కోర్సు చెన్నై, తేజ్‌పూర్ క్యాంపస్‌లలో అందిస్తున్నారు. మ్యాథ్స్ సబ్జెక్టుగా ఏదేని డిగ్రీ, బీఈ/బీటెక్ చేసినవారు అర్హులు.
పీజీడీఏఆర్‌ఎస్‌ఎంఏ: ఏడాది కాలపరిమితి గల ‘పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ మేనేజ్‌మెంట్ విత్ స్టాటిస్టికల్ మెథడ్‌స అండ్ అనలిటిక్స్’ కోర్సును ఐఎస్‌ఐ గిరిథి బ్రాంచిలో అందిస్తున్నారు. మ్యాథ్స్/స్టాటిస్టిక్స్‌తో ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు.
పీజీడీబీఏ: పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్సును ఐఎస్‌ఐ, ఐఐటీ-ఖరగ్‌పూర్, ఐఐఎం-కోల్‌కతా సంయుక్తంగా అందిస్తున్నారుు.
ఇవిగాక దేశంలోని వివిధ ఐఎస్‌ఐ క్యాంపస్‌లలో ఆయా కోర్సుల్లో జూనియర్ ఈసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) సైతం అందిస్తున్నారు.
ఎంపిక ఎలా..
ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, ఇంటర్వ్యూల ద్వారా ఆయా కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్షల సిలబస్, మోడల్ పేపర్లు ఐఎస్‌ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఐఎస్‌ఐ క్యాంపస్‌ల్లో కోర్సుకు ఎంపికైన వారికి స్కాలర్‌షిప్/ఫెలోషిప్ సదుపాయం ఉంది.