Skip to main content

Admissions: కేడీసీలో స్పాట్‌ అడ్మిషన్లు

విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి న‌వంబ‌ర్‌ 25న స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కేడీసీ ప్రిన్సిపాల్‌ జి.రాజారెడ్డి న‌వంబ‌ర్‌ 23న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Spot admissions in KDC

సీపీ గేట్‌ అర్హత సాధించిన వారు ఈస్పాట్‌ అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించని, డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాఽధించిన విద్యార్థులు కూడా స్పాట్‌ అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు.

చదవండి: Degree College: బాన్సువాడ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి

కేడీసీలో ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లిష్‌, ఎంకామ్‌, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌లో మిగిలిన సీట్లలో స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియను న‌వంబ‌ర్‌ 25న ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Published date : 24 Nov 2023 04:04PM

Photo Stories