ఉన్నత చదువులతో బాగా ఎదగాలి.. మనవడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో సీఎం
ఏప్రిల్ 18న హైదరాబాద్ శివార్లలో ఖాజాగూడలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు జరిగాయి. ఈ స్కూల్‌లోనే చదువుతున్న కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్–శోభ దంపతులు, కేటీఆర్–శైలిమ దంపతులు, హిమాన్షు సోదరి అలేఖ్య, అమ్మమ్మ, మేనమామలు, ఇతర బంధువులు కూడా హాజరయ్యారు.
చదవండి: Naina Jaiswalకు డాక్టరేట్.. దేశంలోనే అతి పిన్న వయస్కురాలు
పట్టా అందుకున్న హిమాన్షు దానిని తాత కేసీఆర్ చేతిలోపెట్టి పాదాలకు నమస్కరించారు. కేసీఆర్ మనవడిని హత్తుకుని అభినందించారు. కేటీఆర్–శైలిమ కూడా తమ కుమారుడిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హిమాన్షుతోపాటు ఇతర విద్యార్థులంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇక కమ్యూనిటీ యాక్టివిటీ సర్విసెస్ (సీఏఎస్) విభాగంలో ప్రతిభ చాటినందుకు హిమాన్షు ఓక్రిడ్జ్ ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు.
చదవండి: Archery World Cup: డిప్యూటీ కలెక్టర్, ఆర్చర్ జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు