Skip to main content

NMC: మెడిసిటీ వైద్య కళాశాలకు షాక్‌

సాక్షి, హైదరాబాద్‌: మెడిసిటీ వైద్య కళాశాలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ (ఎంబీబీఎస్‌) కోర్సుల్లో ప్రవేశాలను జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మే 30న రద్దు చేసింది.
NMC
మెడిసిటీ వైద్య కళాశాలకు షాక్‌

మేడ్చల్‌ జిల్లా ఘన్‌పూర్‌లో మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ కళాశాల ఉంది. వాటిలో 2023–24 వైద్య విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌ కోర్సులో ప్రవేశాలను రద్దు చేసినట్లు ఎన్‌ఎంసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

చదవండి: కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ‘ప్రైవేటు’ చెక్‌?

ప్రవేశాల రద్దుకు కారణాలను మాత్రం ఎన్‌ఎంసీ పేర్కొనలేదు. ఈ విషయమై తమకు కూడా ఇంకా సమాచారం రాలేదని, కారణాలు తెలియవని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో ఈ ఏడాది నీట్‌ రాసిన విద్యార్థులు ఈ కళాశాలలో చేరడానికి వీలుండదు.    

చదవండి: Medical Department: ఆ పోస్టులకు ఏజ్‌ భారమైంది!

Published date : 31 May 2023 03:01PM

Photo Stories