Shankar Acharya: సెంట్రల్ వర్సిటీ చాన్సలర్‌గా శంకర్ ఆచార్య
ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులిచ్చారు. డాక్టర్ శంకర్ ఆచార్య దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల్లో ఒకరు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆరేళ్ల పాటు సలహాదారుగా, ఎనిమిదేళ్ల పాటు (1993–2001) మధ్య ప్రధాన సలహాదారుడిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి ఆర్థిక మంత్రులకు సలహాలు అందించారు. సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సభ్యుడిగానూ ఉన్నారు.
చదవండి: Higher Education: సెంట్రల్ యూనివర్సిటీస్.. ఉమ్మడి ఎంట్రన్స్!
2001 నుంచి 12వ ఆర్థిక సంఘం సభ్యుడిగా, 2009–13 మధ్య జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా పనిచేశారు. కోటక్ మహీంద్ర బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా 12 ఏళ్ల పాటు వ్యవహరించారు. వరల్డ్ బ్యాంక్‌లోనూ పనిచేశారు. బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో 18 ఏళ్లుగా కాలమిస్ట్‌గా ఉన్నారు. 2005–16 మధ్య రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన సలహా బోర్డులలో పనిచేశారు.