Skip to main content

NCERT: ఎస్‌ఈఏఎస్‌ పరీక్ష తేదీ ఇదే..

నిజామాబాద్‌ అర్బన్‌ : విద్యా ప్రమాణాలు, భాష, గణితం, చిత్రలేఖన తదితర అంశాల్లో విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఎన్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో స్టేట్‌ ఎడ్యుకేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే (ఎస్‌ఈఏఎస్‌) పరీక్షను నిర్వహించనున్నారు.
NCERT
ఎస్‌ఈఏఎస్‌ పరీక్ష తేదీ ఇదే..

ఈ పరీక్షను నవంబర్‌ 3న (శుక్రవారం) జిల్లా వ్యాప్తంగా 1,137 కేంద్రాల్లో నిర్వహిస్తారు. 29,163 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకోసం అన్ని విభాగాల్లో కోన్ని పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో ఫౌండేషన్‌ మూడు, ఆరు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యా ప్రమాణాలు, నైపుణ్యాలను పరిశీలించానున్నరు. ఇప్పటికే ఎంపిక చేసిన బడుల్లో విద్యార్థులకు నాలుగు ప్రాక్టీస్‌ టెస్ట్‌లు నిర్వహించారు.

చదవండి: Laptops for Tribal Students: గిరిజన విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు
పరీక్షలో మూడు, ఆరో తరగతి విద్యార్థులకు భాషకు సంబంధించి 20 ప్రశ్నలు, గణితానికి సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు. తొమ్మిది తరగతి విద్యార్థులకు భాషకు సంబంధించి 30 ప్రశ్నలు, గణితం 31 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షకు నగరంలోని గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులను ఇన్విజిలేటర్లుగా నియమించారు. ఈ పరీక్ష ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారు అన్ని రంగాల్లో రాణించే విధంగా బోధన చేపట్టనున్నారు. విద్యార్థులతో పాటు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పరిపాలన అంశాలకు సంబంధించి పరీక్షలు రాయల్సి ఉంటుంది.

Published date : 01 Nov 2023 12:59PM

Photo Stories