Laptops for Tribal Students: గిరిజన విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు
బూర్గంపాడు/భద్రాచలం టౌన్: గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదివి పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబర్చిన విద్యార్థినులకు ఐటీసీ అనుబంధ భద్రాద్రి మహిళా సమితి(బీఎంఎస్) ఆధ్వర్యాన ల్యాప్‌టాప్‌లు అందజేశారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కట్టం శ్రీవల్లిక, కొర్సా లక్ష్మి చదవగా, శ్రీవల్లిక భువనేశ్వర్‌లోని ఎన్‌ఐఎస్‌ఈఆర్ కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతోంది. వీరి ఉన్నత చదువులకు ల్యాప్‌టాప్‌లు అవసరం కావడంతో ఐటీసీ యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో బీఎంఎస్ ఆధ్వర్యాన గురువారం లాప్‌టాప్‌లు అందించగా, ఐటీసీ పీఎస్‌పీడీ అడ్మిన్ చెంగలరావు మాట్లాడారు. చదువులో రాణిస్తున్న ఏజెన్సీ ప్రాంత విద్యార్థినులకు చేయూతనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ ఉపాధ్యక్షురాలు సునీత మొహంతి, లక్ష్మీ రాంబాబు, అంజు థమక్, శ్రీదేవి సుబ్రహ్మణ్యం, ప్రతిభాచౌదరి, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: NMMS Scholarships: కేంద్ర ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు భరోసా.. ఏడాదికి రూ.12వేల స్కాలర్‌షిప్