Schools and Colleges Closed 2023 : రేపు స్కూల్స్, కాలేజీలకు సెలవు.. కారణం ఇదే..!
ఈ విషయంలో ప్రభుత్వం చూసిచూడనట్టు వ్యవహారిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని వామపక్ష విద్యార్థి సంఘం (AISF) నిర్ణయించింది.
ఇందులో భాగంగానే జూలై 12వ తేదీన (బుధవారం) విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది. తెలంగాణలోనూ గత నెలలో కూడా బంద్ నిర్వహించిన విషయం తెల్సిందే. విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని.. ఈ అక్రమ ఫీజు దోపిడీ దందాను తెరదించేందుకు పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చాయి. వీటితో పాటు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు పూర్తిస్థాయిలో టీచర్ల నియామకం చేపట్టాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది.
విద్యారంగ సంక్షేమాన్ని..
హైదరాబాద్ లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశమైన నాయకులు.. విద్యారంగ సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందంటూ విమర్శించారు.
విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వంకు..
తెలంగాణ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ బడ్జెట్ లో విద్యకు నిధులు కేటాయించకుండా.. విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందంటూ ఆరోపించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జూలై 12వ తేదీన తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘం(AISF) పిలుపునిచ్చింది.
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
☛ Schools closed : భారీగా వర్షాలు.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. ఇంకా..