Schools closed : భారీగా వర్షాలు.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. ఇంకా..
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోతున్నాయి. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్‌డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ నేడు జూలై 10వ తేదీ(సోమవారం) పాఠశాలకు సెలవును ప్రకటించారు. అలాగే ఇంకా రానున్న రెండు రోజులు పాటు భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఈ స్కూల్స్‌కు సెలవులను పొడిగించే అవకాశం ఉంది. అలాగే వర్షాలు ప్రభావం ఉన్న Delhi, Uttarakhand, Himachal Pradesh, Rajasthan, Punjab, and Uttar Pradeshలోని కొన్ని స్కూల్స్, కాలేజీలకు, ఆఫీస్‌లకు కూడా సెలవులు ఇచ్చారు.
ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ఫస్ట్..
ఉత్తరభారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 19 మంది చనిపోయారు. ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం.
ఢిల్లీతోపాటు గురుగ్రామ్ సహా పలు నగరాలు పట్టణాల్లో రహదారులపై నీరు నిలవడంతో జనం ట్రాఫిక్ కష్టాలపై వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది.
హిమాచల్ ప్రదేశ్‌లోని భారీగా..
హిమాచల్ ప్రదేశ్‌లోని 7 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. సిమ్లా జిల్లాలో ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, కులు, చంబా జిల్లాల్లో ఒక్కరు చొప్పున చనిపోయారు. గత 36 గంటల్లో 14 కొండ చరియలు విరిగి పడిన ఘటనలు, 13 ఆకస్మిక వరదల ఘటనలు నమోదయ్యాయి. వరదలతో కొట్టుకుపోయిన 700 రోడ్లను మూసివేశారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం లాహోల్ స్పిటిలోని చంద్రతాల్‌లో 200 మంది వరద నీటిలో చిక్కుకుపోయారు. బియాస్ వరదల్లో చండీగఢ్–మనాలి హైవేలోని కొంతభాగం కొట్టుకుపోయింది. మనాలి, కిన్నౌర్, చంబాల్లో వరదల్లో దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోయాయి.
చదవండి: Job Opportunities After Class 12th MPC : ఎంపీసీతో.. కొలువులు ఇవిగో!
ఉత్తరాఖండ్‌లో..
ఉత్తరాఖండ్‌లో భక్తులతో వెళ్తున్న జీపు రిషికేశ్–బద్రీనాథ్ నేషనల్ హైవేపై గంగా నదిలో పడిపోయి ముగ్గురు మృతి చెందారు. జీపులో 11 మంది ఉండగా, ఐదుగురిని కాపాడామని, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని యంత్రాంగం తెలిపింది.
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి.