School And Colleges Holidays: భారీ వర్షం.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
తమిళనాడులో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.
తమిళనాడులో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో నాలుగు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ విధించింది.
స్కూళ్లు, కాలేజీలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ఈరోజు(సోమవారం) తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని అడయార్, అన్నాసాలై, వేప్పేరి, గిండి, కోయంబేడులో ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నాగపట్నం, కరైకల్, పుదుచ్చేరిలో భారీ వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.