Skip to main content

Sports: స్కూల్‌ గేమ్స్‌ క్రీడాకారుల ఎంపికకు షెడ్యూల్‌ జారీ

అనంతపురం: స్కూల్‌ గేమ్స్‌ (ఎస్‌జీఎఫ్‌) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అండర్‌–14, 17 క్రీడాకారుల ఎంపికకు షెడ్యూల్‌ విడుదలైంది.
Schedule issued for selection of school games players
స్కూల్‌ గేమ్స్‌ క్రీడాకారుల ఎంపికకు షెడ్యూల్‌ జారీ

 ఈ మేరకు అనంతపురం జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ సుగుణమ్మ, శ్రీసత్యసాయి జిల్లా సెక్రెటరీ అంజన్న, కో ఆర్డినేటర్‌ నాగరాజు తెలిపారు. అనంతపురం న్యూటౌన్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించే ఎంపికలకు రెండు జిల్లాల క్రీడాకారులు పాల్గొనాలని కోరారు.

చదవండి: Chess Competitions: ఇన్‌స్పైరో పాఠశాలలో చ‌ద‌రంగం పోటీలు

  • అక్టోబ‌ర్ 27న బాల్‌ బ్యాండ్మింటన్‌ అండర్‌–14 బాలురు, బాలికలు, జిమ్మాస్టిక్‌, బాక్సింగ్‌, మాల్‌కంబ్‌ ఎంపిక.
  • 28న కరాటే, 30న బాల్‌ బ్యాండ్మింటన్‌, ఫుట్‌బాల్‌ (అండర్‌–17), 31న ఫుట్‌బాల్‌ అండర్‌–14 బాలుర, బాలికల ఎంపిక.
  • నవంబర్‌ 1న నెట్‌బాల్‌, టేబుల్‌ టెన్నిస్‌, రోప్‌ స్కిప్పింగ్‌, 2న సైక్లింగ్‌, తైక్వాండో, వాలీబాల్‌, మూడో తేదీన టెన్నికాయిట్‌ క్రీడాకారుల ఎంపిక.
  • నాలుగో తేదీన సెపక్‌ తక్రా, రోల్‌ బాల్‌, షూటింగ్‌బాల్‌, ఏడో తేదీన రగ్బీ, క్రికెట్‌, ఎనిమదో తేదీన కబడ్డీ అండర్‌–14, తొమ్మిదో తేదీన కబడ్డీ అండర్‌–17, 19న త్రోబాల్‌, 13న సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌, స్కే మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడాకారుల ఎంపికలు కుంటాయి.  
Published date : 26 Oct 2023 01:16PM

Photo Stories