Skip to main content

KV Murali Krishna: విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

అనకాపల్లి టౌన్‌: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబ‌ర్ 25న‌ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు.
KV Murali Krishna
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

 ‘లైంగిక వేధింపుల నుంచి మహిళలు, పిల్లల రక్షణ–సామాజిక పాత్ర’ అనే అంశంపై వివిధ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎస్‌హెచ్‌వోలు పాఠశాలలను సందర్శించి సమసమాజ నిర్మాణంలో, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, అమలు పరుస్తున్న చట్టాలపై విద్యార్థులకు వివరించినట్లు చెప్పారు. 

చదవండి:

India to Bharat : ఇక‌పై దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు 'భారత్' పేరు..!

Sky Bus: స్కై బస్సు సర్వీస్‌ అంటే ఏమిటి? రవాణాలో ఎంత సౌలభ్యం?

Published date : 26 Oct 2023 03:08PM

Photo Stories