India to Bharat : ఇకపై దేశవ్యాప్తంగా పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు 'భారత్' పేరు..!
అయితే.. ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు NCERT ప్యానెల్ ఏకగ్రీవంగా అంగీకారం తెలిపినట్లు ప్యానెల్ చైర్మన్ ఐజాక్ బుధవారం వెల్లడించారు. కొత్త ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ ఉంటుందని స్పష్టం చేశారాయన.
ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం..
చాలాకాలంగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. తాజాగా ఏకగ్రీవంగా సభ్యులంతా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. ఎన్‌సీఈఆర్‌టీ తరపున అన్ని పుస్తకాల్లో ఈ మార్పు రాబోతుందని ప్యానెల్ ఆశిస్తున్నట్లు తెలిపారాయన. అలాగే.. పాఠ్య పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులు.. పురాతన చరిత్ర, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టాలని కూడా ప్యానెల్ సిఫార్సు చేసినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు.. వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. చరిత్రలో ఇప్పటిదాకా మన ఓటముల ప్రస్తావనే ఉంది. కానీ, మొఘలుల మీద, సుల్తానుల మీద మన విజయాల గురించి ప్రస్తావన లేదు అని అంటున్నారాయన.