Skip to main content

RGUKT: తుది విడత కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

నూజివీడు: ఏపీలోని Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో పీయూసీ ప్రథమ సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నవంబర్‌ 27న తుది విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు.
RGUKT
తుది విడత కౌన్సెలింగ్‌ తేదీ ఇదే..

ఈ విషయాన్ని వర్సిటీ చాన్స్‌లర్‌ ఆచార్య కేసీ రెడ్డి నవంబర్‌ 23న తెలిపారు. నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహించనున్న ఈ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఖాళీ సీట్లకు ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు వెయిటింగ్‌ జాబితాను కూడా వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు.

చదవండి: AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్‌

ఎంపికైన అభ్యర్థులు, వెయిటింగ్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు వర్సిటీ వెబ్‌సైట్‌ నుంచి కాల్‌లెటర్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. వెయిటింగ్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు సీట్లు వచ్చినట్లు కాదని, ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు గైర్హాజరైతే వెయిటింగ్‌ జాబితాలో ఉన్న వారికి సీటు వస్తుందని తెలిపారు.

చదవండి: RGUKT Admissions: ఆర్‌జీయూకేటీ బాసరలో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌

Published date : 24 Nov 2022 03:53PM

Photo Stories