Results: జాతీయ టాలెంట్ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ సంస్థ జాతీయస్థాయిలో నిర్వ హించిన టాలెంట్ టెస్ట్ ఫలితాలను తెలంగాణ విద్యామంత్రి సబితాఇంద్రారెడ్డి ఏప్రిల్ 19న విడుదల చేశారు.
జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పరీక్ష నిర్వహించినట్టు ఫౌండేషన్ కన్వీనర్ ఆరుకాల రామచంద్రారెడ్డి, కో–ఆర్డినేటర్ ఎన్ ఎస్రెడ్డి తెలిపారు. ప్రతిభ కనబరచిన విద్యార్థులను ఇస్రో వంటి కేంద్రాలకు తీసుకెళ్లడమే కాకుండా, నగదు పారితోషికాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఏప్రిల్ 25న పురస్కారాలు అందిస్తామని చెప్పారు.
Published date : 20 Apr 2022 02:38PM