APVVP ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల
Sakshi Education
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి కార్యాలయం పరిధిలో లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ నంబర్ 8/2022కు దరఖాస్తు చేసుకున్న వారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను ఆదివారం విడుదల చేశారు. ప్రాథమిక మెరిట్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగు ఆధారాలతో ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి డాక్టర్ బీఎం రత్నాకర్ తెలిపారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను https://guntur.ap.gov.in/ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
Also read: కార్పొరేట్ స్కూళ్లలోనూ ‘కోటా’
Published date : 13 Jun 2022 03:32PM