Skip to main content

Government Schools: విద్యార్థులకు రాగిజావ

ragi java distribution program for students

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ నెల మొదటి వారంలో రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. అందుకు అనుగుణంగా జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ పంపిణీ కార్యక్రమం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో సంబంధం లేకుండా నేరుగా దీనిని అందించనున్నాఉ. జిల్లాలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వచ్చే విద్యార్థులు ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోకుండానే వస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రార్థన అయ్యాక ఇంటర్వెల్‌ బెల్‌కి ముందు రాగి జావను అందించనున్నారు. అయితే వారంలో మూడు రోజులపాటు విద్యార్థులకు గుడ్డు పెట్టని రోజు మాత్రమే అందిస్తారు. దీంతో జిల్లావ్యాప్తంగా 852 పాఠశాలల్లోని 76 వేల మంది విద్యార్థులకు మేలు జరగనుంది.

విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంపొందించాలి

లోపాన్ని అధిగమించేలా..
పేద విద్యార్థుల్లో పౌష్టికాహార లోపంతో మానసిక, శారీరక ఎదుగుదల సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిని పూర్తిస్థాయిలో తగ్గించేందుకు ఇప్పటికే బడుల్లో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అలాగే వారంలో మూడు రోజులు గుడ్డు అందిస్తుండగా.. ఇకపై రాగి జావ అదనంగా అందిస్తున్నారు. గుడ్డును సోమ, బుధ, గురు ఇస్తుండగా.. మంగళ, గురు, శనివారాలు రాగి జావ ఇస్తారు. రాగిజావలో 8 శాతం ప్రొటీన్స్‌, 70 శాతం పిండి పదార్థాలు, 20 శాతం పీచు, 2 శాతం మినరల్స్‌ ఉండగా.. క్యాల్షియంతో చిన్నారులు ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంది. బెల్లం, రాగుల్లో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బాలికల్లో రక్తహీనతను సైతం అధిగమించవచ్చు. ప్రతి విద్యార్థికి 10 గ్రాముల జావ, 10 గ్రాముల బెల్లం ఇవ్వాల్సి ఉంది.

852 పాఠశాలల్లో 76 వేల విద్యార్థులకు అందజేత జిల్లాకు చేరిన 8,100 కిలోల రాగిజావ బెల్లం పాకెట్లు చిన్నారుల ఎదుగుదలకు తోడ్పడనున్న పౌష్టికాహారం నాణ్యమైన జావ

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచే రాగి జావ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రధానంగా విద్యార్థుల్లో పౌష్టికాహారాన్ని, రక్తహీనతను తగ్గించేందుకు మంగళ, గురు, శనివారాల్లో మధ్యాహ్న భోజనంతో సంబంధం లేకుండా విద్యార్థులకు వడ్డించేలా చర్యలు తీసుకుంటున్నాం. నాణ్యమైన జావను వడ్డిచేందుకు ఎంఈఓలు, హెచ్‌ఎంలు చొరవ చూపాలి. – రవీందర్‌, డీఈఓ

Published date : 26 Jul 2023 03:22PM

Photo Stories