ఉన్నత విద్యార్థులకు క్విజ్ పోటీలు ప్రారంభం
విద్యార్థుల్లో పోటీతత్వానికి చేయూత ఇవ్వడంతో పాటు వారికి నగదు పురస్కారాలను ఇచ్చేలా కార్యక్రమాలను ప్రారంభించినట్లు వివరించారు. క్విజ్ కాంపిటీషన్–2022, బెస్ట్ ఇన్నోవేషన్, బెస్ట్ కమ్యూనిటీ సర్వీస్ తదితరాలను ప్రారంభిస్తున్నామన్నారు. 700కు పైగా బృందాలకు ఆ¯ŒSలై¯ŒS పరీక్ష నిర్వహించి 40 బృందాలను ఎంపిక చేస్తామని, వారికి ప్రత్యక్ష విధానంలో క్విజ్‌పోటీ ఉంటుందని చెప్పారు. మొదటిరోజు వచ్చిన 31 బృందాల నుంచి 16 బృందాలను ఎంపికచేసి గురువారం క్వార్టర్ ఫైనల్స్, వీటి ద్వారా ఎనిమిది టీమ్‌లకు సెమీఫైనల్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో గెలుపొందిన నాలుగు బృందాలకు 22వ తేదీ ఫైనల్స్ నిర్వహించి విజేతలకు బహుమతులిస్తామన్నారు. మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండో బహుమతిగా రూ.60 వేలు, మూడో బహుమతిగా రూ.30 వేలు, నాలుగో బహుమతిగా రూ.10 వేల నగదు, సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పారు.