Higher Education: అక్షోబర్ 20 నుంచి పీఎస్‌టీయూ దూరవిద్యా కేంద్రం పరీక్షలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం 2020-21వ సంవత్సరానికి రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలను అక్షోబర్ 20 నుంచి 81వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ కర్ణాటక సంగీతం, 4వ సంవత్సరం, పీజీ డిప్లామా జ్యోతిర్వాస్తు, టీవీ జర్నలిజం, డిప్లామా లలిత సంగీతం మొదటి, 2వ సంవత్సరం, సినిమా రచన, డిప్లొమా జ్యోతిష్యం, సర్టిఫికెట్ జ్యోతిష్యం, సంగీత విశారద మొదటి, 2వ 4వ, 5వ, 6వ సంవత్సరం రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఎం.ఎ(జ్యోతిషం, తెలుగు, సంస్కృతం, కమ్యూనికేషన్ జర్నలిజం, ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ టూరిజం మేనేజ్‌మెంట్) బీఏ స్పెషల్ తెలుగు మొదటి, 2వ, 8వ సంవత్సరం, బీఏ కర్ణాటక సంగీతం మొదటి, 2వ, 8వ సంవత్సరం బ్యాక్‌లాగ్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షల హైదరాబాద్, రాజమండ్రి, వరంగల్ కూచిపూడి ప్రాంగణాల్లో నిర్వహిస్తామని డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.