Palamuru University: పీయూలో ఫీజుల పెంపుపై నిరసన
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో ఫీజులు ఇష్టానుసారంగా పెంచుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.
జూలై 11న పీయూ ముఖద్వారం వద్ద విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పీయూలో పరీక్ష ఫీజులతో పాటు కోర్సు ఫీజులు విద్యార్థులకు భారంగా మారాయన్నారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
చదవండి: Data Entry Operator Jobs: డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు.. వారికి స్కిల్ టెస్టులు
అనంతరం పీయూ రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయంపై రిజిస్ట్రార్ స్పందిస్తూ.. సమస్యను ప్రభుత్వం దృస్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్‌ఎం, బీఆర్‌ఎస్‌వీ నాయకులు రూప్‌సింగ్, భరత్, హరి, బాలరాజ్, శివ, ఎడ్వర్డ్, మౌనిక, శ్రావణి, ప్రియాంక పాల్గొన్నారు.
Published date : 13 Jul 2024 10:27AM