Degree Results: పింగిళి మహిళా డిగ్రీ కళాశాల సెమిస్టర్ల ఫలితాల విడుదల
Sakshi Education
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాలల (అటానమస్) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్, రెండో సంవత్సరం మూడో సెమిస్టర్, మూడో సంవత్సరం ఐదో సెమి స్టర్ పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 6న ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి, కేయూ అదనపు ప రీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి విడుదల చేశారు.
డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలో 523మందికిగాను 300 మంది విద్యార్థినులు 57.3శాతం ఉత్తీర్ణత సాధించారు. మూడో సెమిస్టర్‌పరీక్షలో 458మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా అందులో 277మంది 60.4శాతం ఉత్తీర్ణత సాధించారు.
చదవండి: David Marjot: చదువుకు వయసుతో సంబంధం లేదు.. 95 ఏళ్లలో డిగ్రీ పట్టా.. ఎవరికంటే..!
ఐదో సెమిస్టర్ పరీక్షలకు 419 మంది విద్యార్థినులు పరీక్షలు రాయగా అందులో 330మంది విద్యార్థినులు 78.70శాతం ఉత్తీర్ణత సాధించారు. కళాశాల పరీక్షల నియంత్రణాధికారి రామకృష్ణారె డ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారులు రేణుక, శిరీష, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని పాల్గొన్నారు.
Published date : 07 Feb 2024 01:00PM