Skip to main content

KU: పీహెచ్‌డీ అడ్మిషన్లపై ఆందోళన

కేయూ క్యాంపస్‌: కేయూలోని వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ రెండో కేటగిరీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల బాధ్యులు సెప్టెంబ‌ర్ 4న‌ ఆందోళనకు దిగారు.
KU
పీహెచ్‌డీ అడ్మిషన్లపై ఆందోళన

పరిపాలనా భవనంలో వీసీ చాంబర్‌లోకి చొచ్చుకుని వెళ్లారు. వీసీ రమేశ్‌, రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రావుతో వాగ్వాదానికి దిగా రు. వివిధ విభాగాల్లో పలువురు అభ్యర్థులకు అన్యాయం జరిగిందని వారి దృష్టికి తీసుకెళ్లారు. సీట్లను పెంచాలని అప్పటి వరకు అడ్మిషన్ల ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. పీహెచ్‌డీ సీట్లు పెంచాకే అర్హులకు సీట్లు ఇచ్చి రెండో జాబితా విడుదల చేయాలని కోరారు. వీసీ రమేశ్‌ మాట్లాడుతూ.. పారదర్శకంగానే పీహెచ్‌డీ అడ్మిషన్లు నిర్వహించామని ఏమైనా తప్పులు జరిగినట్లు తేలితే సవరిస్తామని పేర్కొన్నారు.

చదవండి: Inspiring Women Success Story : కూలీ భారతి కాదు.. డాక్టర్‌ భారతి అనాల్సిందే.. ఈ స‌క్సెస్‌ జ‌ర్నీ ఎందరికో స్ఫూర్తి..

వీసీ చాంబర్‌ తలుపులు మూసి ఆందోళన చేస్తుండగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈఆందోళనలో తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ ఇన్‌చార్జ్‌ నాగరాజుగౌడ్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా కో–ఆర్డినేటర్‌ పాషా, బీఆర్‌ఎస్‌వీ నాయకులు తిరుపతి, స్పోర్ట్స్‌ పర్సన్‌ మట్టెడ కుమార్‌, దళిత శక్తి నాయకులు శంకర్‌ ప్రసాద్‌, మధు పాల్గొన్నారు.

చదవండి: Kakatiya University: పీహెచ్‌డీ సీట్లు పెంచాలని ఆందోళన

Published date : 05 Sep 2023 02:58PM

Photo Stories