ఉస్మానియ విశ్వవిద్యాలయ విద్యార్థులు డుసిముస్ 2023 ప్రారంభం.. ముఖ్య అతిథిగా
ఇందులో ఫిబ్రవరి 10 జరగాల్సిన సాహిత్య సాంస్కృతిక పోటీలు వ్యాసరచన,ఉపన్యాస,ముగ్గులపోటిలు మొదలైనవి విజయవంతంగా పూర్తి అయ్యాయి. ఈ వేడుకలో అనుబంధ న్యాయ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. ఈ వేడుకని న్యాయ విభాగ అధిపతి ప్రొ. ఎన్.వెంకటేశ్వర్లు, కళాశాల ప్రిన్సిపాల్ డి.రాధిక యాదవ్, కళాశాల ప్రొఫెసర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రారంభించారు.
చదవండి: ఉద్యమాల గడ్డ నుంచి ఉద్యోగాల అడ్డాగా #OsmaniaUniversity: CV Anand, IPS
ఫిబ్రవరి 11న ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే వేడుకకి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయన్ గారు ముఖ్య అతిథిగా పాల్గోని న్యాయ విద్యార్థులకి దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాహిత్య,సాంస్కృతిక, ఇతర పోటీలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఈ వేడుక 2011 నుంచి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. విద్యార్థుల మనో వికాసాన్ని పెంపొందించి, సృజనాత్మకతను వెలికితీసేందుకు ఈ వేడుకలను ప్రతి నంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు.
చదవండి: దేశ విదేశాల్లో ప్రముఖులు.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచే.. | Prof. D. Ravinder, VC (OU)