Skip to main content

Admissions: పీహెచ్‌డీ ప్రవేశాలపై కొనసాగుతున్న వివాదం

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలపై వివాదం కొనసాగుతోంది. అర్హత మార్కులపై విద్యార్థులు పట్టు వీడటం లేదు.
Admissions
పీహెచ్‌డీ ప్రవేశాలపై కొనసాగుతున్న వివాదం

అదే సమయంలో అధికారులు తగ్గడం లేదు. యూజీసీ నిబంధనల ప్రకారం రెండు కేటగిరిలలో ప్రవేశాలను కొనసాగించాలి. కేటగిరి–1లో యూజీసీ నెట్, సెట్‌ అర్హత గల అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించాలి. కానీ యూజీసీ నెట్, సెట్‌ అర్హత సాధించిన వారికి కూడా అర్హత పరీక్షను నిర్వహించారు. అర్హత మార్కులు తగ్గించాలని విద్యార్థులు, తగ్గించలేమని అధికారులు దీంతో వర్సిటీలో 20 రోజులుగా వివిధ రూపాలలో కొనసాగుతున్నాయి. 

చదవండి: Admissions: ‘మనూ’లో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

ఐదేళ్ల తర్వాత పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ 

ఓయూలో ఐదేళ్ల తరువాత (2017లో చివరిది) 2022 ఆగస్టులో పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ వెలువడటంతో తీవ్ర పోటీ ఏర్పడింది. సుమారు 600 పీహెచ్‌డీ సీట్లకు 9775 మంది దరఖాస్తు చేసుకొగా 6656 మాత్రమే పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షను రాశారు. అందులో కేవలం 1508 మంది మాత్రమే అర్హత సాధించారు. అధ్యాపకుల కొరత వలన అర్హత పొందిన విద్యార్థులందరికీ పీహెచ్‌డీలో సీటు లభించదు. యూజీసీ 2016 నిబంధనలు పాటిస్తూ, సీట్ల సంఖ్యను పెంచేల చర్యలు తీసుకొని అర్హత మార్కులు తగ్గించాలని వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు ఐక్య విద్యార్థి సంఘంగా ఏర్పడి ఆందోళనలు చేస్తున్నారు. 

చదవండి: Admissions: ప‌లు కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు దరఖాస్తులు అహ్వానం.. చివ‌రి తేదీ ఇదే

రిజర్వేషన్‌ రోస్టర్‌ విధానాన్ని అమలు చేయాలి 
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ విధానాన్ని పాటించి చివరి సీటు వరకు భర్తీ చేయాలి. అర్హత మార్కుల వలన మిగిలే సీట్లను ఇతర వర్గాలకు బదిలీ చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్దం. 
– చటారి దశరథ్‌. 

మూడు లోపాలు ఉన్నాయి 
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాల పక్రియలో మూడు లోపాలు ఉన్నాయి. ప్రశ్నాపత్రంలో 50 శాతం రీసెర్చ్‌ మెథడాలజీ ప్రశ్నలు లేవు, 2016 యూజీసీ నిబంధనలు పాటించాలి, ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు లేకున్న ప్రవేశం కల్పించాలి. 
–ప్రొ.వినోద్‌కుమార్, లా డీన్‌ 

అస్తవ్యస్తంగా ప్రవేశాలు 
ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలు అస్తవ్యస్థంగా కొనసాగుతున్నాయి. కేవలం విద్యార్థి నాయకులను ఏరివేసేందుకే కొత్త నిబంధనలు విధించారు. యూజీసీ నిబంధనల ప్రకారం కేటగిరి–1 ప్రవేశాలలో నెట్‌ అర్హత గల అభ్యర్థులకు నేరుగా ప్రవేశాలు కల్పించాలి, కానీ వారికి కూడా అర్హత పరీక్ష పెట్టారు. జేఆర్‌ఎఫ్‌ (జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో) అర్హత పరీక్ష పెట్టాలని కానీ వారికి నేరుగా ప్రవేశాలు 
కల్పిస్తున్నారు. 
– బైరు నాగరాజుగౌడ్‌ 
అమ్మాయిలకు అన్యాయం 
ఓయూ పీహెచ్‌డీ ప్రవే శాల్లో అమ్మాయిలకు తీరని అన్యాయం జరిగింది. ప్రతి ఏటా పీజీ కోర్సులలో 70 శాతం మంది అమ్మాయిలు ప్రవేశం పొందుతుండగా ఐదు సంవత్సరాల తరువాత చేపడుతున్న పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలో కేవలం 724 మంది (22శాతం) అర్హత సాధించారు. నూతన విద్య విధానం (ఎన్‌ఈపీ–2020) వలనే ఈ దుస్థితి ఏర్పడింది. 
– తల్లమల్ల శ్వేత 

Published date : 13 Feb 2023 01:54PM

Photo Stories