NMMS: ‘నేషనల్ మీన్స్ కం మెరిట్’ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
ఇప్పటికే పరీక్షకు దరఖాస్తు చేసిన విద్యార్థులు httpse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకో వచ్చని ఎసెస్సీ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. డిసెంబర్ 18న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీ క్ష జరగనుందని వెల్లడించారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2022 | టైం టేబుల్ 2022 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 163 కేంద్రాలు ఏర్పాటు చేశార న్నా రు. తెలంగాణవ్యాప్తంగా 8వ తరగతి చదివే 32,899 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించినవారికి సంవత్సరానికి రూ.12 వేల చొప్పున, ఇంటర్మీడియట్ వరకు సహాయం అందుతుంది. 2021లో ఈ పరీక్షను రాష్ట్రంలో 21,132 మంది రాయగా.. వీరిలో 2,441 మంది అర్హత సాధించారు.