Nizam College: నిజాం కళాశాల విద్యార్థినుల ఆందోళన
Sakshi Education
గన్‌ఫౌండ్రీ : నిజాం కళాశాల వసతి గృహం బాలికలు మరోసారి ఆందోళనకు దిగారు. తమ హాస్టల్‌లో సౌకర్యాలను కల్పించాలని కోరుతూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు విద్యార్థినిలు మాట్లాడుతూ..గత కొన్ని నెలలుగా వసతి గృహంలో సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బెడ్‌పై ముగ్గురు ఉండాలంటే ఎలా? అని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కళాశాల యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేక ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వాపోయారు.
చదవండి: Guidelines for Designation of Senior Advocates: న్యాయవాదుల హోదాపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
గత కొన్ని నెలలుగా తమ సమస్యలను పరిష్కరించాలని నిజాం కళాశాల ప్రిన్సిపల్ భీమా నాయక్‌ను అడుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. తొలుత ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట నిరసన తెలిపినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు బషీర్‌బాగ్ చౌరస్తాలో నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
Published date : 21 Dec 2023 04:14PM