ఈ కాలేజీల ఫీజు పెంపుపై వచ్చే నెల విచారణ
అదేవిధంగా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో పెంపునకు సంబంధించి ఆగస్టు 10 నుంచి 12వ తేదీ వరకూ విచారణ జరపనుంది. నిర్ణయించిన తేదీల్లో కాలేజీ యాజమాన్యాలు అన్ని వివరాలతో తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
వాస్తవాలు వెలుగు చూసేనా?
రాష్ట్రంలో దాదాపు 120 ఫార్మసీ కాలేజీలు, 152 ఎంబీఏ, ఎంసీఏ కళాశాలలు ఉండగా..రోజుకు 40 లేదా 50 చొప్పున యాజమాన్యాలతో చర్చలు జరిపితే వాస్తవాలు ఎలా వెలుగులోకి వస్తాయని విద్యా రంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయా కళాశాలల్లో విద్యార్థులకు తగిన వసతులున్నాయా? అధ్యాపకులు సరైన విధంగా ఉన్నారా, వారికి సరిపడా జీతాలు చెల్లిస్తున్నారా? వంటి అంశాలను కూడా కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
పట్టించుకునేవారేరి?
ఫార్మసీ కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా వాటిని పట్టించుకునేవారే లేరు. కాలేజీల్లో అధ్యాపకులకు వేతనాలు ఇవ్వని దారుణమైన పరిస్థితులున్నాయి. వారి ఖాతాలు, పే స్లిప్స్ పరిశీలించినా అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇవేవీ పట్టించుకోకుండా, విచారణతంతు ముగించే ఎఫ్‌ఆర్‌సీ చర్యలతో ప్రయోజనం శూన్యం.
– అయినేని సంతోష్ కుమార్ (టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు)