National Law University:కర్నూలులో లా వర్సిటీ
Sakshi Education

గట్టులో నేషనల్ లా యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. జగన్నాథ గట్టుపై 50 ఎకరాల్లో రూ.88.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాల, క్లస్టర్ విశ్వవిద్యాలయం పరిపాలన భవన సముదాయ నిర్మాణానికి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌లు గురువారం భూమి పూజ చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ స్టేట్ ఆర్కిటెక్ బోర్డు ద్వారా క్లస్టర్ వర్సిటీ భవనాలను అత్యంత నాణ్యంగా నిర్మిస్తున్నట్టు చెప్పారు.
Published date : 11 Feb 2022 03:48PM