Kakatiya University: ఎంపీఈడీ పరీక్షలు తేదీలు ఇవే..
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఎంపీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఏప్రిల్ 18 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాధిక తెలిపారు.
![KU Examination Schedule KU Campus MPED exam dates Controller of Examinations Narsimhachari and Additional Controller of Examinations Radhika](/sites/default/files/images/2024/04/05/gurukul-school-admissions-1712320070.jpg)
ఏప్రిల్ 18న పేపర్–1 రీసెర్చ్ ప్రాసెస్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సైన్సెస్, 20న పేపర్–2 ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్‌సైజ్, 23న పేపర్–3 యోగాసైన్స్, 25న పేపర్–4 టెస్ట్ మెసర్‌మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు జరుగుతాయని సూచించారు.
చదవండి:
Best Courses After Inter: ఇంటర్ తర్వాత చదవడానికి అవకాశం ఉన్న టాప్ 100 కోర్సులు.. వాటి వివరాలు..
Civils: అన్ని సబ్జక్ట్స్ పైన ఇలా ఫోకస్ చేయాలి | Krishna Pradeep #sakshieducation
Published date : 05 Apr 2024 05:57PM