Kakatiya University: ఎంబీఏ పరీక్షలు షురూ
Sakshi Education
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో సెప్టెంబర్ 25న ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
క్యాంపస్‌లోని కామర్స్ కళాశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య టి.శ్రీనివాస్‌రావు, ఆకళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఆచార్య నర్సింహాచారి, పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సీహెచ్ రాధిక పరిశీలించారు.
చదవండి: Mega Job Mela: ఉద్యోగ, ఉపాధి కల్పనలో అగ్రస్థానం
ఐదేళ్ల లా పరీక్షలు కూడా..
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లా కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా సెప్టెంబర్ 25న ప్రారంభమయ్యాయి. నగరంలోని సీకేఎం కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఎ.నరేందర్, డి.రమేశ్ పరిశీలించారు.
Published date : 26 Sep 2023 04:15PM