Alumni: ప్రభుత్వ కళాశాలలో పనికొచ్చే పనిచేద్దాం..
ఈ మేరకు జనవరి 29న ఒక ప్రకటన విడుదల చేసారు. డిగ్రీ కళాశాలలో కలసుకున్న పూర్వ విద్యార్థులు తాము 2011లో తిరిగి కలుసుకున్న మీదట పూర్వ విద్యార్థుల సంఘంగా ఏర్పడి చేసిన పలు సేవా కార్యక్రమాలు గురించి సంఘ బాధ్యులు మండల గౌరీశంకర్ వివరించారు. తాము చదువుకున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలను, పూర్వపు ఇంటర్మీడియట్ కళాశాల భవనాలను పరిశీలించి గత స్మృతులను నెమరు వేసుకున్నారు.
చదవండి: Krishnadevaraya Polytechnic College: పూర్వ విద్యార్థుల కృషి అభినందనీయం
డిగ్రీ కళాశాల అల్యుమ్నీ చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా ఇదే విద్యార్థి సంఘం సభ్యులు ఉండడంతో కళాశాలకు నాక్ గుర్తింపు రావడంలో తమ వంతు చేసిన కృషిని వివరించారు. కరోనా సమయంలో పాదచారులకు ఆహార కిరాణా సరుకులు పంపిణీ చేసినట్టు చెప్పారు. డిగ్రీ కళాశాలలో శాశ్వత పని నిమిత్తం పూర్వ విద్యార్థులు సీనియర్ ఆడిట్ ఆఫీసర్ కోటిపల్లి కృష్ణాజీ, శ్రీకాకుళం పోలీస్ సూపరింటెండెంట్ వింజమూరి సత్యనారాయణమూర్తి, పాడేరు ఐటీడీఏ గృహనిర్మాణశాఖ ఇంజినీర్ తమ వంతు ఆర్థిక సహాయాన్ని వేదిక నుంచే ప్రకటించారు. ఒక మంచి పని చేయడానికి కలుసుకున్న మనం మళ్లీ మళ్లీ కలుసుకుందాం, మరిన్ని మంచి పనులు చేద్దాం అంటూ ఆనందంగా వీడ్కోలు పలికారు.