July 16, 17th Schools and Colleges Holidays 2023 : వరుసగా రెండు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు.. కారణం ఇదే..
తాజాగా జూలై 17వ తేదీన (సోమవారం) స్కూల్స్, కాలేజీలకు బోనాలు పండగ సందర్భంగా ప్రభుత్వం సెలవును ప్రకటిచింది. అలాగే జూలై 16వ తేదీన ఆదివారం.. సాధరణ సెలవు ఉన్న విషయం తెల్సిందే. దీంతో స్కూల్స్, కాలేజీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు రానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం..
తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు గత నెల జూన్ లో కోలాహలంగా ప్రారంభమయ్యాయి. మహంకాళి అమ్మవారికి తొలిబోనంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. జూన్ 22న గోల్కొండలో ఆషాడ బోనాలు, జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, జులై 16న ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహిస్తారు.బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్ 2023 ప్రకారం జూలై 17వ తేదీన సోమవారం రోజున సెలవు ఉంటుంది. ఈ రోజున సాధారణ సెలవు కింద కేటాయిస్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు.
➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో సెలవులు ఇవే..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.