Skip to main content

Telangana: అటకెక్కిన ఐటీఐ విద్య

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి జిల్లాలో ఐటీఐ కళాశాలల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కళాశాలల్లో చేరిన విద్యార్థులకు నామమాత్రంగా, మొక్కుబడిగా చదువులు బోధిస్తున్నారు.
ITI education   Mahbubnagar ITI College  Nominal Teaching in Mahbubnagar ITI Colleges

నిబంధనలకు విరుద్ధంగా కనీసం తరగతి గదులు, ల్యాబ్‌లు, యంత్ర పరికరాలు, వసతులు లేకుండానే నిర్వహిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కువగా ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌, ప్లంబర్‌ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. అయితే ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు పూర్తిస్థాయి నైపుణ్యాలు లేకుండానే బయటికి వస్తున్నారు.

చదవండి: Guest Speech: రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక పోటీలో నిలబడాలంటే...

యాజమాన్యాలకు రాష్ట్రస్థాయిలో ఉండే సంఘాల నాయకులు, కొందరు ఐటీఐ విద్యాశాఖాధికారుల అండదండలు ఉండడం వల్ల వారు ఏం చేసిన చెల్లిపోతుందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కళాశాలల్లో ఎలా బోధించినా.. ఎలా నిర్వహించినా అడిగే వారు లేరని ధోరణిలో కొనసాగిస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో కళాశాలల డొల్లతనం బయటబడింది. దీనిపై ఐటీఐ విద్యాశాఖ అధికారులకు రిపోర్టు పంపించారు. కానీ, వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఉమ్మడి జిల్లాలో 30కిపైగా కళాశాలలు ఉండగా.. 7,500 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

sakshi education whatsapp channel image link

Published date : 21 Dec 2023 11:36AM

Photo Stories