Skip to main content

Admissions: డిగ్రీ ఆనర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఏయూక్యాంపస్‌: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి నాల్గో సంవత్సరంలో (డిగ్రీ ఆనర్స్‌) ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకుడు ఆచార్య డి.ఎ.నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
Admissions
డిగ్రీ ఆనర్స్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 ఏయూ క్యాంపస్‌ కళాశాలలో ప్రవేశాల కోసం www. audoa. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. బి.ఎ, బి.కాం, బి.ఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఫీజు, రిజిస్ట్రేషన్‌ విధానం తదితర వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులను అక్టోబ‌ర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటలోపు ఏయూ ప్రవేశాల కార్యాలయంలో అందజేయాలి. జనరల్‌ విద్యార్థులు రూ.850, బీసీ విద్యార్థులు రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ విద్యార్థులు రూ.650 దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

చదవండి: Degree College Seats: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్ల పెంపు

బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సు ఫీజు రూ.41,500, బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సు ఫీజు రూ.39,500, బీఎస్సీ స్టాటిస్టిక్స్‌ కోర్సు ఫీజు రూ. 35,500, కామర్స్‌ ఫీజు రూ.25,500, బి.ఎ. ఎకనామిక్స్‌ ఫీజు రూ.25,500గా నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న వారికి అక్టోబ‌ర్ 27న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో కోర్సులో గరిష్టంగా 40 మందికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.

Published date : 14 Oct 2023 03:46PM

Photo Stories