ఖమ్మం సహకారనగర్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఎస్డీఎల్‌సీఈలో బీఏ, బీకాం, ఎంఏ, ఎంకాం తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈమేరకు ఖమ్మంలోని యూనివర్సిటీ పీజీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి.గోపి ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఇంటర్, తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డిగ్రీలో ప్రవేశం పొందొచ్చని తెలిపారు.
అలాగే, డిగ్రీ పూర్తిచేసిన వారు ఎంఏ, ఎంకాం తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 25 వ తేదీలోగా స్థానిక అధ్యయన కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99085 70890, 98492 50633 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. చదవండి: