Skip to main content

Intermediate: అక్టోబర్‌ 25 నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు

Exam Hall
Exam Hall

ఎట్టకేలకు ఇంటరీ్మడియట్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీని శుక్రవారం ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. అక్టోబర్‌ 25 నుంచి నవంబర్‌ రెండు వరకు పరీక్షలు నిర్వహిస్తామని టైంటేబుల్‌ విడుదల చేసింది. గతంలో ప్రకటించిన ప్రకారమే 30 శాతం సిలబస్‌ను తప్పించి, 70 శాతం సిలబస్‌లోనే పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు నిర్వహించని విషయం తెలిసిందే. విద్యార్థులందరినీ ద్వితీయ సంవత్సరానికి ప్రమోట్‌ చేశారు. కాగా, కోవిడ్‌ తీవ్రత తగ్గిందని వైద్య, ఆరోగ్య శాఖ ఆగస్టులో తెలపడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెలరోజుల క్రితమే తెలిపారు. విద్యార్థులు రెండో ఏడాది సిలబస్‌తో పాటు, వివిధ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫస్టియర్‌ పరీక్షలపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటిని పక్కన పెట్టి ఇంటర్‌ బోర్డు పరీక్షల తేదీలను వెల్లడించింది.  

ఇదీ టైంటేబుల్‌ .. 

తేదీ పరీక్ష
25–10–21 ది్వతీయ భాష–1
26–10–21 ఇంగ్లిష్‌
27–10–21 మాథ్స్‌ 1ఏ, బోటనీ, పొలిటికల్‌ సైన్స్‌
28–10–21 మాథ్స్‌ 1బీ, జువాలజీ, హిస్టరీ
29–10–21 ఫిజిక్స్, ఎకనామిక్స్‌
30–10–21 కెమిస్ట్రీ, కామర్స్‌
1–11–21 పబ్లిక్‌ అడ్మిని్రస్టేషన్, బ్రిడ్జ్‌ కోర్స్‌ మాథ్స్‌ పేపర్‌–1,
2–11–21 మోడ్రన్‌ లాంగ్వేజ్‌
  పేపర్‌–1, జాగ్రఫీ–1

 

Published date : 25 Sep 2021 04:22PM

Photo Stories